లేటు వయసులో తోడు లేకుండా కొండ చిలువ గుడ్లు పెట్టింది.. ఎలా?
python
వాటిలో రెండిటిని జెనిటిక్ శాంపిలింగ్ కోసం పంపించారు. వీటిని పరీక్షించడం ద్వారా గుడ్లు ఎలా పెట్టింది అనే విషయాన్ని తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. నిజానికి పాములు చాలా వరకూ ఆలస్యంగా ఫలదీకరణం చెందడానికి వీలుగా కొంత వీర్యాన్ని తమలో నిలువ ఉంచుకుంటాయి.
అయితే, దానిని కూడా అరవై ఏళ్ల వయసులోపులోనే ఫలదీకరిస్తాయని జూ హెర్పటాలజీ మేనేజర్ మార్క్ వానర్ తెలిపారు. ఇక ఇందులో రెండు గుడ్లు పనిచేయకుండా పోయాయి. మిగిలిన మూడు గుడ్లను పిల్లలను చేయడానికి ఇంక్యుబెటర్‌లో ఉంచారు.
ఆ కొండచిలువ వయసు 62 సంవత్సరాలు. 20 ఏళ్ల నుంచి ఆ కొండచిలువ ఒక్కటీ ఏ తోడూ లేకుండా ఉంటోంది. మగ కొండచిలువ లేకపోయినా ఈ కొండచిలువ గుడ్లు పెట్టడంతో జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
