గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (12:33 IST)

అత్యంత విషమంగా నిత్యానంద స్వామి ఆరోగ్య పరిస్థితి?

Nithyananda
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, వివాదాస్పద స్వామి నిత్యానంద ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దీంతో ఆయనకు తక్షణ వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక పాలకలను రాజకీయ ఆశ్రయ కోరారు. తక్షణ వైద్య సేవల కోసం రాజకీయ ఆశ్రయం కల్పించాని నిత్యానంద తరపున శ్రీలంక అధ్యక్షుడు రణల్ విక్రమ సింఘేకు ఓ లేఖ రాశారు. 
 
ఇందులో నిత్యానంద వైద్య సేవల కోసం అయ్యే మొత్తం ఖర్చులను తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా శ్రీలంకలో రాజీకీయ ఆశ్రయం కల్పిస్తే శ్రీలంకలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతామని హామీ ఇచ్చారు. అయితే, నిత్యానంద స్వామి రాసిన లేఖపై శ్రీలంక అధ్యక్షుడు స్పందించాల్సివుంది.
 
కాగా, అత్యాచార కేసులో అరెస్టు అయిన నిత్యానంద బెయిలుపై విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన కోర్టు విచారణకు హాజరుకాకుండా దేశం విడిచి పారిపోయాడు. ఈక్వెడార్ దేశంలోని ఓ దీవిని కొనుగోలు చేసి దీనికి కైలాస దేశం పేరు పెట్టి సొంత దేశంగా ప్రకటించి, ఆ దేశానికి అధ్యక్షుడుగా తానేనని స్వయం ప్రకటితం చేసుకున్నారు.