ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (12:02 IST)

పల్నాడు జిల్లాలో ఘోరం - లారీ అదుపుతప్పి నలుగురు మృతి

road accident
ఉమ్మడి గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పల్నాడులోని నకరికల్లు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నరసరావు పేట వైపు నాపరాళ్ళ లోడుతో వెళుతున్న లారీ ఒకటి అదుపు తప్పి... బోల్తాపడింది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. సమచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సివుంది.