ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గుంటూరు జిల్లాలో బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం

victim
గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన తాజా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం మేరకు.. ఆగస్టు 27వ తేదీన 14 యేళ్ల బాలిక రాత్రి 7 గంటల సమయంలో ఇంటి బయటకు వెళ్లి ఆ తర్వాత మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. 
 
దీంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి ఆ బాలిక ఆచూకీని తెలుసుకున్నారు. ఆ బాలికను నాని అనే యువకుడు అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. 27వ తేదీన బాలికను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నాని అక్కడ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను ఇంటి సమీపంలో రాత్రిపూట వదిలి వెళ్లిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బాలికను చేరదీసి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి వద్ద పోలీసులు జరిపిన విచారణలో వెల్లడించింది. దీంతో నాని, జగన్మోహన్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.