శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:47 IST)

డీమార్ట్‌లో జనసైనికుల చోరీ చేసినట్టు దుష్ప్రచారం...

pawan-kalyan-jana-sena-party-song
గుంటూరులోని ప్రముఖ సూపర్ మార్కెట్ డిమార్ట్‌లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు (జనసైనికులు) చోరీ చేసినట్టు దుష్ప్రచారం సాగుతోంది. దీనిపై గంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు స్పందించారు. డిమార్ట్ షోరూమ్‌లో జనసైనికులు చోరీ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుందన్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. కేవలం జనసేనను భ్రష్టుపట్టించేందుకు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం సాగుతోందన్నారు. తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 
 
కాగా, గుంటూరు పట్టణంలోని నాజ్ సెంటరులో డిమార్ట్ యాజమాన్యంతో తాము మాట్లాడామని, వారు కూడా అలాంటిదేమీ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. తమ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై భవిష్యత్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.