మంగళవారం, 31 జనవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (08:47 IST)

రహదారిపై పేలిపోయిన గ్యాస్ సిలిండర్ లారీ... తప్పిన పెను ప్రమాదం

gas cylinder lorry blast
అనంతపురం - గుంటూరు జాతీయ రహదారిపై అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్యాస్ లారీ ట్యాంటర్ పేలిపోయింది. కర్నూలు నుంచి నెల్లూరుకు బయలుదేరిన ఈ లారీ దద్దవాడ పేలిపోయింది. భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
కర్నూలు నుంచి ఉలవపాడుకు దాదాపు 300పైగా గ్యాస్ సిలిండర్లతో ఓ లారీ బయలుదేరింది. దద్దవాడ వద్ద క్యాబిన్‌ నుంచి ఉన్నట్టుండి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్ మోహన్ రావు వెంటనే లారీ ఆపి కిందికి దిగాడు. సిలిండర్లు పేలే ప్రమాదం ఉందని గ్రహించిన ఆయన రహదారిపై ఇరువైపు వస్తున్న మంటలను నిలిపివేశాడు. ఆ తర్వాత కాసేపటికో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడం మొదలైంది. 
 
మరోవైపు, ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపకదళ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే, ఈ ప్రమాదానికి సమీపంలోని దద్దవాడ గ్రామంలోని 30 కుటుంబాల ప్రజలను ఖాళీ చేయించారు. అయితే, ప్రమాద స్థలానికి అగ్నిమాపకదళ సిబ్బంది చేరుకున్నప్పటికీ పెద్ద శబ్దంతో సిలిండర్లు పేలిపోతుండటంతో లారీ సమీపానికి వెళ్లలోకపోయారు. 
 
దీంతో దూరం నుంచి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో 300 సిలిండర్లకుగాను దాదాపు 100 సిలిండర్ల మేరకు పేలిపోయాయి. లారీ డ్రైవర్‌తో పాటు స్థానిక పోలీసుల అప్రమత్తతతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.