1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (14:12 IST)

స్వామి నిత్యానంద జీవ సమాధి.. 20మందికి పైగా చికిత్స చేస్తున్నారట!?

Nithyananda
స్వామి నిత్యానందస్వామి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తను బోధించే ఆధ్మాత్మిక విషయాల సంగతి పక్కన పెడితే.. లైంగిక ఆరోప‌ణ‌లతో బాగా ఫేమస్ అయిపోయాడు. వార్తల్లో వ్యక్తిగా మారాడు. 
 
ఎప్పుడు చూసినా.. తానే దేవుడినని చెబుతాడు. మన దేశంలో బాబాలను కొలిచే ఏమాత్రం కొదువ లేదు. అలానే నిత్యానందకు కూడా పెద్ద సంఖ్యలోనే భక్తులున్నారు. 
 
అయితే అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం ఆరోపణలు, కోర్టు కేసులతో ఒక్కసారిగా నిత్యానందుడు దేశం నుంచి మాయమయ్యాడు. 
 
ఈక్వెడార్ దగ్గరలోని ఒక దీవిని సొంతం చేసుకుని దానికి కైలాస దేశమని పేరు కూడా పెట్టి అక్కడే ఉంటున్నాడు. ఆ మధ్య జీవ సమాధి పేరుతో తనను తానే కప్పెట్టుకుని చిన్న డ్రామా ప్లే చేశాడు.
 
వీఐపీలకు ఆరోగ్యం బాగోలేకపోయినా..27 మంది వైద్యులు వచ్చి చికిత్స చేయరు. కానీ నిత్యానందుడికి మాత్రం అంతమంది డాక్టర్లు చికిత్స అందిస్తున్నారట. ఆయన దేశంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడంతో.. ఆయన భక్తుల్లోని డాక్టర్లే చికిత్స చేస్తున్నారని చెబుతున్నాడు. 
 
అయితే నిత్యానంద తన పోస్టులో పెట్టినట్లుగా తినలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, మనుషుల్ని గుర్తు పట్టలేకపోవడం.. ఇదంతా చూస్తుంటే ఏదో వింత జబ్బు బారిన పడ్డట్లే ఉన్నాడు స్వామి. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిత్యానందకు కామెడీ టైమింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. 
 
తాను బతికే ఉన్నానన్న విషయం నమ్మకపోతే తిరుమన్నామలై అరుణగిరిలోని యోగేశ్వర సమాధికి వెళ్లాలట. అక్కడ నిత్యానందుడి దర్శనం భక్తులు దొరుకుతుందట. 
 
ఈక్వెడార్‌లోని ఓ దీవిలో ఓ చిన్న సమాధి తవ్వుకుని అందులో కూర్చున్న నిత్యానంద, తమిళనాడులోని అరుణగిరి యోగేశ్వర సమాధిలో ఎలా కనిపిస్తాడు ? పిచ్చి కాకపోతే అంతేకాదు అక్కడ నిరంతరం వెలిగే జ్యోతి ఉన్నంత కాలం తన ప్రాణం కూడా నిలిచే ఉంటుందట. 
 
నిత్యానంద రోగం బారిన పడ్డా వైరాగ్యం చుట్టుముట్టినా ఈ పిచ్చి మాత్రం అస్సలు తగ్గలేనట్లుంది. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతున్నాడు. ఆరు నెలల నుంచి నిత్యానంద అనారోగ్యంతోనే ఉన్నాడని తెలుస్తోంది. 
 
అయితే తనకు క్యాన్సర్ లాంటి రోగాలు లేవని.. అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయని అతనే చెప్తున్నాడు. బలవంతంగా ఆహారాన్ని తీసుకున్నా సరిగా జీర్ణం కావడం లేదట. సమాధిలోనే నిత్య పూజలు చేస్తున్నానని చెబుతున్నాడు.