షాకిచ్చిన ట్రంప్ సర్కారు... వీసా అపాయింట్లమెంట్లు నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తన ఇమిగ్రేషన్ విధానాలతో వలసదారుల్ని వణికిస్తున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లను అర్ధాంతరంగా నిలిపివేసింది.
కొన్ని షెడ్యూల్డ్ ఇంటర్వ్యూలను రద్దు చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో శిక్షణకార్యక్రమం ప్రారంభమైందని, దానిలో భాగంగానే వీసా అపాయింట్‌మెంట్ల సర్దుబాటు జరుగుతుందని అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది.
యుద్ధ మేఘాలు తొలగిపోలేదు.. అమెరికా
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు ప్రస్తుతానికి ఆగినా.. యుద్ధ మేఘాలు మాత్రం తొలగిపోలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఇరాన్‌ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరుచేసేలా ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం తాజాగా కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతానికి ఇరాన్‌పై కొత్తగా దాడులు ఉండవని విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. మిత్రదేశాలకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇరాన్ వైపు నుంచి మళ్లీ దాడులు ప్రారంభమయితే అమెరికా సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అధికారులు వెల్లడించారు.
దాడులు ఉండవని చెప్పినప్పటికీ.. ఇరాన్ ఓడరేవుల నుంచి నౌకల రాకపోకలను కట్టడిచేసేలా హర్మూజ్‌లో దిగ్బంధాన్ని అమెరికా కొనసాగిస్తోంది. మరోవైపు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచేలా కొత్త ఆంక్షలతో విరుచుకుపడింది. ఇరాన్‌కు ప్రపంచంతో ఉన్న ఆర్థిక జీవనాధారాన్ని తెగ్గొట్టడమే తాజా ఆంక్షల లక్ష్యమని యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
