1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Texas Walmart shooting: El Paso gun attack leaves 20 dead

అమెరికాలో కాల్పుల కలకలం... 20 మంది మృత్యువాత

Texas
అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పులు జరిగాయి. టెక్సాస్​లోని ఎల్​పాసో నగరంలో ఉన్న సియలో విస్టా షాపింగ్​ మాల్​లో ఆగంతకులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 
 
అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాల్పుల శబ్దాలకు మాల్​లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సాయుధులు పెద్ద ఎత్తున విరుచుకుపడి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో స్థానికులు భయాందోళనతో పరుగెడుతున్న వీడియోను కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
తర్వాతి కథనం
స్నేహితుల దినోత్సవం ఎప్పుడు.. ఎలా పుట్టింది.. ఇదుగో ఆ సమాచారం