గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:16 IST)

ఐబీ సూచనల మేరకే: జమ్మూ పరిస్థితిపై మంత్రి కిషన్ రెడ్డి

అమర్‌నాథ్ యాత్రకు ముప్పు ఉందని ఐబీ సూచన మేరకే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

న్యూఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో తెలుగు ప్రజలు సహా మరెవరి భద్రతకు ఢోకా లేదన్నారు. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లో 20 మంది విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారని మంత్రి చెప్పారు. శనివారం మధ్యాహ్నానికి తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటారని కిషన్ రెడ్డి తెలిపారు. మిగిలిన 90 మంది విద్యార్ధులు ఆదివారానికి ఢిల్లీకి చేరుకొంటారని మంత్రి స్పష్టంచేశారు. 
 
జమ్మూ నుండి విద్యార్దులు, పర్యాటకులు తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు జమ్మూలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా అస్ట్రేలియాలో పాటు కొన్ని దేశాలు తమ పౌరులను స్వదేశాలకు తిరిగి రావాలని  కోరింది. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్‌కు వెళ్లకూడదని కూడ జాగ్రత్తలు చెప్పింది. ఇప్పటికే కాశ్మీర్‌లో ఉన్న వారిని తమ దేశానికి రావాలని అత్యవసర సందేశాన్ని పంపింది.