శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 31 మే 2019 (18:39 IST)

అన్నా... కిషన్ రెడ్డీ... ప్లీజ్ ప్లీజ్ అని ఏపీ సీఎం జగన్ అంటే...?

కమలదళం తెలంగాణంలో మెల్లమెల్లగా పాగా వేస్తోంది. అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలిచి గులాబీ బాస్ కేసీఆర్‌కి షాకిచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై అనూహ్యంగా విజయం సాధించి ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు తెలంగాణ నుంచి గెలిచిన కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయమంత్రిగా కీలక పదవిని కట్టబెట్టడం ద్వారా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినట్లు అర్థమవుతోంది. 
 
ఇదిలావుంటే కొత్తగా కేంద్ర మంత్రిగా ఎంపికైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హోంమంత్రి అమిత్ షాతో కలిసి పనిచేసే భాగ్యం తనకు లభించినందుకు చాలా చాలా సంతోషంగా వున్నదని వెల్లడించారు.

ఏపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం లేదు కనుక ఆ రాష్ట్రాన్ని చూసుకునే బాధ్యతను కూడా తనకే అప్పగించారని... ఈ మేరకు హైకమాండ్ తనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... అన్నా కిషన్ రెడ్డి ప్లీజ్ అని ప్రత్యేక హోదా కోసం అడిగితే సరిపోతుందేమో?