మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (09:30 IST)

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా అమ్రపాలి.. ఎందుకో ఆ ప్రేమ?

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా వరంగల్ జిల్లా మాజీ కలెక్టర్ అమ్రపాలిని కేంద్రం నియమించింది. ప్రత్యేకంగా ఏరికోరి ఆమెను ఓఎస్డీగా నియమించడం వెనుక ఏదో మతలబు ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఈమె జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించే సమయంలో ప్రజల మన్నలను చూరగొన్నారు. ఎంతో మందికి పలు రకాలైన సహాయం చేసి ఆదుకున్నారు. కలెక్టర్ అనే హోదాను పక్కనబెట్టి అడవుల్లో ట్రెక్కింగ్ నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అదనపు కమిషనరుగా నియమించారు. 
 
ప్రస్తుతం ఆమెతో పాటు మరో ఐఏఎస్ అధికారి కె.శశికిరణాచారిని కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా అమ్రపాలిని నియమించగా, శశికిరణాచారిని ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.