గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:55 IST)

తండ్రి ఉన్మాదానికి రెండేళ్ల చిన్నారి బలి

తండ్రి ఉన్మాదత్వమో లేక మానసిక లోపమో, అతని చేతిలో రెండేళ్ల పాప బలైపోయింది. ప్రక్కనే కూర్చుని టీవీ చూస్తున్న పాపను దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ఇంట్లో తండ్రీ, రెండేళ్ల కూతురు ప్రక్కప్రక్కన కూర్చుని టీవీ చూస్తున్నారు. 
 
ఇంతలో తండ్రికి ఏమైందో తెలియదు, అప్పటి వరకూ పాప తలను నెమ్మదిగా నెరుముతున్న అతను మెల్లగా సోఫాలో నుండి లెచాడు. తిన్నగా వెళ్లి ఓ సుత్తి తెచ్చాడు. కూర్చుని ఉన్న పాప తలపై గట్టిగా కొట్టాడు. చనిపోయే వరకూ అలాగే కొడుతూనే ఉన్నాడు. చివరికి పాప అరిచి అరిచి చనిపోయింది. శవాన్ని తీసుకువెళ్లి బెడ్‌రూంలో ఓ బీరువాలో దాచాడు. ఆ బిగ్గర కేకలకు చుట్టుప్రక్కల వారు తరలివచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఇంటి ముందు నగ్నంగా కూర్చుని ఉన్న తండ్రిని చూసారు. లోపలికి వెళ్లి తనిఖీ చేసారు. పాప శవాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం మా జీవితంలో ఓ పీడకల లాంటిదని, ఇది చూస్తే రాత్రి నిద్ర కూడా పట్టదని పోలీసులు చెప్పారు. కానీ తండ్రి మాత్రం ఆ సమయంలో తనకి మనుసు స్వాధీనంలో లేదని, తను కావాలని ఈ పని చేయలేదని వాదిస్తున్నాడు. ఏది ఏమైనా అతనికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.