ఏంట్రా నువ్వు నాకు చెప్పేది... కొట్టికొట్టి చంపేసిన ప్రియురాలు...

murder1
సందీప్ రేవిళ్ళ| Last Modified సోమవారం, 4 మార్చి 2019 (17:19 IST)
ప్రియుడితో మాట్లాడటానికి వెళ్లి గొడవపెట్టుకుంది. శాంత పరచడానికి ప్రయత్నించిన అతడిని దారుణంగా కొట్టి చంపేసింది. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విల్లీస్ శాండర్స్, నామర్యా బ్రాడ్లే (54) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియుడితో ఏదో మాట్లాడటానికి అతని ఇంటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి నామర్యా అతనితో గొడవపడింది. ఆమెను శాంతపరచడానికి విల్లీస్ ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె కోపం తగ్గలేదు.

ఈ వాగ్వివాదంలో ఆమెకు దొరికిన ఒక వస్తువును తీసుకుని ప్రియుడిని కొట్టి చంపేసింది. అతని నుండి ప్రతిఘటన చలనం లేకపోయేసరికి పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించుకుంది. ఈ దారుణాన్ని చూస్తే ఆమెను ఎవరైనా పోలీసులకు పట్టిస్తారని భయపడి, అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. శవాన్ని లోపల పెట్టి బయట తాళం వేసి పారిపోయింది.

రెండు రోజుల తర్వాత ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని తలుపు తీసాడు. తలుపు ఎదురుగా అతనికి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విచారణ ప్రారంభించారు. విల్లీస్ స్నేహితులు అందించిన సమాచారం ఆధారంగా ప్రేయసి గురించి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా ఎవరికీ కనిపించకుండా పరారీలో ఉందని తెలుసుకున్నారు. పోలీసులు ఆమె జాడ కనిపెట్టి కోర్టులో హజరుపరిచారు. చట్టం ఆమెకు పది లక్షల డాలర్ల (రూ.7కోట్లపైగా) బాండుపై జైల్లో ఉంచింది.దీనిపై మరింత చదవండి :