ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (17:35 IST)

అతడు శృంగారంలో ఊపిరాడనివ్వడట... నాక్కూడా...

మాది బెంగుళూరు. నా భర్త ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. నేను గృహిణిగానే ఇంటిపట్టునే ఉంటున్నా. గత నాలుగేళ్ళుగా ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండటంతో చాలా మంది స్నేహితులు పరిచయమయ్యారు. వారిలో ఓ స్నేహితురాలితో పిచ్చాపాటిగా మాట్లాడుతుండగా, ఓ ఆసక్తికరమైన విషయం చెప్పింది. అదేంటంటే... ఆమెకు ఓ వ్యక్తితో పరిచయమే కాకుండా శృంగార అనుభవం కూడా ఉందట. 
 
అతనితో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఊపిరి ఆడనివ్వడని, గాలి పీల్చుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తారని చెప్పింది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా శరీరం కూడా అలాంటి సుఖం కోసం ఆరాటపడుతోంది. పైగా.. నా భర్త పనీ పనీ అంటూ ఆఫీసుకే పరిమితమైపోతున్నారు. వీకెండ్‌లో సినిమాలు, షికార్లంటూ సిటీ టూర్‌కు వెళుతున్నాం. దీంతో నాలో కోర్కెలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఆ అనుభవం కోసం నా శరీరం తొందరపడుతోంది. ఏం చేయాలి?
 
శృంగారం అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా వుంటుంది. మీ స్నేహితురాలు మీకు కాస్త ఎక్కువగా చెప్పి వుండవచ్చు. అంతమాత్రాన అదే నిజం అనుకోవద్దు. పరాయి పురుషులతో శృంగారం చెరుపు చేస్తుంది. ముందు ఆ విషయం మీ స్నేహితురాలికి చెప్పండి. ఇక మీ విషయానికి వస్తే... శృంగారపరంగా సిద్ధం చేయడం, కావడంలో భార్యాభర్తల పాత్ర సమానమే. 
 
ఊపిరాడనివ్వనంత శృంగారం కావాలనుకుంటే మీ భర్త అలా చేయగలరు. అందుకు అనువుగా పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత మీదే. ఇక మీరే ఆలోచించుకోండి... ఎలా కల్పించాలన్నది మీ చేతుల్లోనే వుంటుంది. ఎవరో చేస్తున్నారని అనుకుంటూ మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు.