బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (20:24 IST)

గర్భవతిని చేసిన నా బోయ్ ఫ్రెండ్ అమెరికా వెళ్లిపోయాడు... ఇప్పుడు...

నా బోయ్ ఫ్రెండ్ వల్ల గర్భం వస్తే మొదటి నెలలోనే అబార్షన్ చేయించుకున్నాను. ఆ తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయాడు. అక్కడికెళ్లాక ఫోన్ చేసి తనను మర్చిపొమ్మన్నాడు. ఇంట్లోవాళ్లు నాకు వేరే సంబంధం చూస్తున్నారు. ఇపుడు చూస్తున్న అబ్బాయితో దాదాపు పెళ్లి నిశ్చయమైపోయింది. నేనిప్పుడు ఇతడిని పెళ్లి చేసుకుంటే నాకు గర్భం వచ్చిన సంగతి అతడు తెలుసుకోగలడా... నాకు అబార్షన్ అయినట్లు తెలుసుకుంటాడా...?
 
మీరు కానీ, లేదంటే మీ బోయ్ ఫ్రెండు కానీ లేదంటే మీకు అబార్షన్ చేసిన డాక్టర్ కానీ చెబితేనే మీకు అలా జరిగిందన్న విషయం తెలుస్తుంది. మీకు మరీ గిల్టీ ఫీలింగ్ కలిగితే మీరే చెప్పేసినా చెప్పేయవచ్చు. అంతేతప్ప ఆ విషయం అతడికి తెలిసే అవకాశం లేనేలేదు. మీ బోయ్ ఫ్రెండ్ మర్చిపొమ్మని మాట మార్చాడు కనుక ఇక అతడి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని గడపండి. పెళ్లికి ముందు అలా హద్దులు దాటినవారు జీవితంలో ఇలా బాధపడాల్సి వస్తుంది.