శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By జె
Last Modified: శనివారం, 23 ఫిబ్రవరి 2019 (19:02 IST)

రోజూ మహిళలు శృంగారంలో పాల్గొంటే అలా అవుతారా? నిజమేనా?

శృంగారానికి సంబంధించిన విషయంలో అనేక అపోహలు, అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. అందరూ అనుకునే విధంగా ఎలాంటి శాస్త్రీయత లేని అభిప్రాయాలకు బాగా ప్రచారం ఉంటుంది. బహిరంగంగా చర్చించుకునే అంశం కాకపోవడం సందేహ నివృత్తికి అవకాశాలు తక్కువగా ఉండటంతో అనేక అపోహలు వినిపిస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనే మహిళలు లావు అవుతారనే వాదన వున్నది. ఐతే ఇదంతా అపోహే అంటున్నారు వైద్యులు.
 
వివాహమయ్యాక చాలామంది మహిళలు లావవుతూ ఉంటారు. అప్పటివరకూ సన్నగా, పీలగా వుండేవారు సైతం ఏదో తెలియని కొత్త మెరుపు, ఓంట్లో కొత్త సత్తువ వస్తూ ఉంటుంది. ఈ మార్పు చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఈ మార్పుకు శృంగారానికి సంబంధం ఉంటుందనే ఒక అభిప్రాయం ఏర్పడింది. వివాహమైన తరువాత భార్య లావు కావడానికి శృంగారానికి ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు చెబుతున్నారు.
 
తీసుకునే ఆహారంతో పాటు శారీరక శ్రమ తగ్గడం వంటి వాటి కారణాల వల్ల పెళ్ళి తరువాత చాలామంది లావవుతూ ఉంటారు. ఆనందంతో కూడా లావవుతూ ఉంటారని పరిశోధనలో తేలిందట. అందుకే పెళ్లయిన తరువాత శృంగారంలో కలవడం వల్ల లావవుతారన్నది అపోహ మాత్రమేనంటున్నారు వైద్య నిపుణులు.