శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (18:23 IST)

నా మొగుడుని లోబరుచుకునే మందేదైనా వుందా?

పెళ్లయిన దగ్గర్నుంచి చూస్తున్నా... నా మొగుడు నన్ను కేవలం పడకగది వరకే పరిమితం చేస్తున్నారు. నన్ను అసలు పట్టించుకోవడంలేదు. నా భర్త నన్ను విడిచి వెళ్లకుండా నన్నే అంటిపెట్టుకుని వుండే ఏదైనా మందు వుందా.. ఆ మందు పెడితే నన్ను ఆయన నిత్యం కొంగు పట్టుకుని తిరేగేలా వుండాలి. సలహా ఇవ్వండి ప్లీజ్...
 
మొగుడికి మందు పెట్టి లోబరుచుకోవడం అనేది అపోహ. అసలు పెట్టుడు మందులు అనేవి లేనేలేవు. ఏ మొగుడయినప్పటికీ తన భార్య కొంగు పట్టుకుని వదలకుండా తిరుగుతున్నాడని అంటే, ఆమె మీద అతడికి చెప్పలేనంత క్రేజ్ ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 
 
విపరీతమైన క్రేజ్ ఉన్నప్పుడు ఎవరు ఏమన్నా అనుకుంటారనే ధ్యాస కూడా ఉండదు వారికి. ఇలాంటివారు ఇంట్లో ఎవరున్నప్పటికీ శృంగారం భావనలు రాగానే ఆ అనుభవం కోసం పడక గదికి వెళ్లిపోతుంటారు. దీన్ని చూసినప్పుడే మీరనకున్నట్లు అదేదో మందు పెట్టి ఇలా మార్చేసిందని అనుకుంటారు. అంతేతప్ప మందు పెట్టి లొంగదీసుకోవడం వంటిదేమీ లేదు.