శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (14:51 IST)

అల్లు అర్జున్ వంటి వ్యక్తిని పెళ్లాడతా... హీరోయిన్

'నేను పెళ్లి చేసుకుంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా'నని చెప్తోంది 'లవర్స్ డే' చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించిన నూరిన్ షరీఫ్. ఇటీవల విడుదలైన 'లవర్స్ డే' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అల్లు అర్జున్ రావడం నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నూరిన్ 'లవర్స్ డే' సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. 
 
ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి, ఆయన మీద తనకు ఉన్న అభిమానం గురించి చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి బన్నీ అంటే తనకు ఇష్టమని, బన్నీ నటించిన అన్ని సినిమాలు మలయాళంలో కూడా విడుదలవుతుండటంతో వాటిని తప్పకుండా చూస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను పెళ్లంటూ చేసుకుంటే అల్లు అర్జున్ వంటి వ్యక్తినే చేసుకుంటానని చెప్పింది.
 
వాస్తవానికి 'లవర్స్ డే' సినిమాకు మొదటి హీరోయిన్‌గా నూరిన్ షరీఫ్‌ను, సెకండ్ హీరోయిన్‌గా ప్రియా వారియర్‌ను తీసుకున్నారు. అయితే ప్రియా వారియర్ కన్ను గీటే వీడియో దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ఆమెకు వచ్చిన క్రేజ్‌ను చూసి నూరిన్ పాత్ర నిడివిని తగ్గించేసారు. అందువల్ల భవిష్యత్తులో ప్రియా ప్రకాష్ వారియర్‌తో నటించాల్సి వస్తే ఆచి తూచి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.