నేను మగాడిని కాదు.. మహిళను.. జైల్లో ట్రాన్స్‌జెండర్ గగ్గోలు
నేను మగాడిని కాదు బాబోయ్... మహిళను అంటూ ఓ ట్రాన్స్‌జెండర్ జైల్లో గగ్గోలు పెడుతోంది. పైగా, మగ ఖైదీలు ఉన్న జైల్లో వేస్తే తనపై అత్యాచారం జరిగితే ఎవరు బాధ్యులు అంటూ జైలు సిబ్బందిని నిలదీస్తోంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన 37 ఏళ్ల కెవిన్ చెస్ట్‌నట్ అబ్బాయి అయినప్పటికీ, స్త్రీగా మారాలని అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. తిరిగి మగవాడిగా మారడం కుదరదని తెలిసినా కూడా ఆ పని చేశాడు. జేర్ బ్రౌన్‌గా పేరు కూడా మార్చుకున్నాడు.
అయితే బీమా సొమ్ము మోసం కేసులో బ్రౌన్‌ను అరెస్టు చేసి మగ ఖైదీలు ఉండే జైల్లో బంధించారు. దీనిపై అతను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. 37 మంది మగాళ్లతో ఇప్పుడు ఒకే గదిలో ఉన్నానని, వారితో కలిసి స్నానం చేయవలసి వస్తోందని, అది తనకు ఇష్టం లేదని, వెంటనే మహిళల జైలుకు మార్చాలని డిమాండ్ చేస్తోంది.
తనపై అత్యాచారం జరిగితే దానికి బాధ్యులు మీరే అవుతారని సిబ్బందికి చెప్పింది. 2017లో అరెస్టయిన జేర్ బ్రౌన్, అప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్ అకామడేషన్ రివ్యూ కమిటీకి, స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీకి జైలు మార్పించమని విన్నపాలు చేస్తూనే ఉన్నాడు.