గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (17:54 IST)

మంచినీళ్లు కావాలన్నాడు... తెచ్చిస్తే 10 వేల డాలర్లు టిప్ ఇచ్చిన 'అజ్ఞాతవాసి'

హోటలుకి వెళ్లి భోజనం చేసిన తర్వాత లేచి వచ్చేటపుడు సర్వ్ చేసినవారికి మనం టిప్స్ ఇస్తుంటాం. ఈ టిప్ ఇచ్చేవారి స్థాయి ఒకొక్కరిలో ఒక్కోలా వుంటుంది. బాగా డబ్బున్నవారయితే సుమారు రూ. 500 నుంచి రూ. 1000 వరకూ ఇస్తారేమో. కానీ ఏకంగా 10 వేల డాలర్లు.. అంటే, ఏడున్నర లక్షల రూపాయలు టిప్‌గా ఇస్తారా? కానీ ఇచ్చాడు ఓ వ్యక్తి. 
 
వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్‌విల్లే సుప్ డాగ్స్ రెస్టారెంట్‌కి ఓ వ్యక్తి వచ్చాడు. అతడికి వెయిటర్ మంచినీళ్లు ఇచ్చి అతడి ఆర్డర్ తీసుకువచ్చేందుకు లోనికి వెళ్లింది. ఐతే ఆ వెయిటర్ తిరిగి వచ్చేలోపే 10 వేల డాలర్లు (అక్షరాల ఏడున్నర లక్షలు) టిప్ పెట్టేసి, మీ మంచినీళ్లు చాలా బాగున్నాయి అంటూ ఓ కామెంట్ రాసి వెళ్లిపోయాడు. 
 
వెయిటర్ ఆ డబ్బు చూసి షాక్ తిన్నది. తనను ఎవరైనా జోక్ చేస్తున్నారేమోనని అనుకున్నది. కానీ అది నిజమేనని తెలిసి ఆశ్చర్యపోయింది. ఇంతకీ ఆ టిప్ ఇచ్చిన వ్యక్తి మిస్టర్‌ బీస్ట్‌ అనే యూ ట్యూబ్‌ స్టార్. ఇతడికి మిలియన్ల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు వున్నారు. డబ్బులు కూడా కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతుంటాయి. అందువల్ల అతడు అప్పుడప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల వద్దకు వచ్చి భారీ బహుమతులు ఇచ్చేసి వెళ్లిపోతుంటాడు. ఇప్పుడిలా చేశాడు.