గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (18:09 IST)

ప్రియురాలిపై అసభ్య కామెంట్లు చేశారనీ... వదలకుండా పొడిచాడు...

ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేవారిని చూస్తుంటాం, తీసేవారినీ చూస్తుంటాం. ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. కేవలం ప్రియురాలిపై అసభ్యంగా కామెంట్స్ చేశారని ఇద్దరిని దారుణంగా కత్తితో పొడిచాడు ప్రేమికుడు. దాంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేసారు. 
 
వివరాల్లోకి వెళితే, 24 ఏళ్ల రాహుల్ కేశవ్‌రావ్ సేవత్కర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ చేయడానికి స్థానికంగా ఉండే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌కి వచ్చాడు. అక్కడ ఉన్న అక్షయ్‌ అశోక్, అన్షుల్ అనే ఆకతాయిలు అతని ప్రేయసిని చూసి కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అసభ్యంగా మాట్లాడారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన రాహుల్ వారిపై కోప్పడ్డాడు. వాగ్వివాదానికి దిగాడు. గొడవ కాస్త పెద్దదై పోట్లాటగా మారింది. 
 
ఈ నేపథ్యంలో వారిద్దరినీ రాహుల్ కత్తితో పొడిచాడు. నిర్విరామంగా 14 పోట్లు పొడిచాడు. ఫుడ్ కోర్ట్ యజమాన్యం వచ్చి అడ్డుకునేవరకూ  దాడి ఆపలేదు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న వారిని అక్కడే వదిలేసి ప్రియుడు, ప్రియురాలు పరారయ్యారు. గాయపడిన వారిని ఫుడ్ కోర్ట్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో అక్షయ్‌‌కి మెడ, చేతులు, ముఖానికి, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. ఆక్షయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనకు కారణమైన ప్రియురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.