సంబంధిత వార్తలు
- వామ్మో చికెన్ ముక్క.. అలా ఎగిరిపడి.. ఎవరి నోటా పడకుండా జంప్ అయ్యిందా? (video)
- నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమం : తగ్గిన ప్లేట్లెట్స్...
- మోదీని పేల్చేస్తా.. సూసైడ్ బాంబర్ జాకెట్‌తో పాక్ సింగర్.. ఫోటో వైరల్
- అరుదైన విచిత్రం.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం
- డిగ్రీ పట్టా కోసం 8 మంది డూప్‌లు.. ఎంపీని సస్పెండ్ చేసిన వర్శిటీ!
ఫ్లోరిడాలో తొలి గిటార్ ఆకృతి హోటల్
అద్భుత ఇంజనీరింగ్ సృజనాత్మకత ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలకు ప్రాణంపోసింది. అలాంటి మరో నిర్మాణానికి జీవం పోశారు ఇంజనీర్లు. 450 అడుగుల ఎత్తుతో గిటార్ రూపంలో భారీ హోటల్‌ను నిర్మించారు.
ప్రపంచంలో గిటార్ ఆకృతిలో నిర్మించిన మొట్టమొదటి ఈ హోటల్ ను గిటార్ హోటల్‌గా పిలుస్తున్నారు. ఈ భవనం ఇటివలే అందుబాటులోకి రావడంతో అతిథులకు ఆహ్వానం పలుకుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ హోటల్ ఉంది.
ఈ హోటల్ నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. సెమినోల్ హార్డ్ రాక్ హోటల్ అండ్ కెసినో, హాలీవుడ్ ఈ హోటల్‌ను నిర్మించింది. ఈ హోటల్ ప్రారంభం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సెమినోల్ హార్డ్ రాక్ తన సంతోషాన్ని పంచుకుంది.
హార్డ్ రాక్ కుటుంబానికి చాలా గొప్పరోజు. గిటార్ హోటల్‌ను అధికారికంగా ప్రారంభించామంటూ సంతోషాన్ని పంచుకుంది. ఇదిలావుండగా అద్భుత ఇంజనీరింగ్ మాస్టర్ పీస్‌కు ప్రతిరూపమైన ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా వారెవ్వా.. అనాల్సిందే.
ఫోర్ట్ లాండెర్‌డేల్-హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాల్లో ప్రయాణించేవారు ఈ హోటల్‌ను వీక్షించవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు.
తర్వాతి కథనం
