మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (21:47 IST)

నవాజ్ షరీఫ్‌ ఆరోగ్యం విషమం : తగ్గిన ప్లేట్‌లెట్స్...

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేసమయంలో ఆయన శరీరంలో రక్తపు ప్లేట్ లెట్స్ బాగా తగ్గిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. 
 
చౌదరి షుగర్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ ప్రస్తుతం జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. అయితే, ఆయన జైలులో తీవ్ర అనారోగ్యంపాలయ్యారు. ముఖ్యంగా, షరీఫ్‌కు భారీ సంఖ్యలో రక్తకణాలు తగ్గిపోవడంతో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) నుంచి వెంటనే లాహోర్‌లోని సర్వీసెస్ ఆస్పత్రికి తరలించారు. 
 
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఏబీ కస్టడీలో ఉన్న తన అన్న షరీఫ్‌ను వైద్య చికిత్స నిమిత్తం విడుదల చేయాలని అతని సోదరుడు షాబాజ్ షరీఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని, బెయిల్ ఇవ్వాల్సిందేని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరోవైపు పిటిషనర్ బెయిల్ అభ్యర్థనపై ఎన్‌ఏబీ ప్రాసిక్యూటర్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో కోర్టు షరీఫ్ బెయిల్ మంజూరు చేసింది.