బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (08:57 IST)

నవాజ్ షరీఫ్ ఆరోగ్యం క్రిటికల్...

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆరోగ్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆయన పలు అవినీతి కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షలో భాగంగా లాహోర్ పరిధిలోని కోట్‌లఖ్‌పత్ జైల్లో ఆయన ఉంటున్నారు. ఆయనకు మంగళవారం రాత్రి అస్వస్థతకు లోనుకావడంతో హుటాహుటిన పంజాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ చెప్పారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, మందులు వాడుతూ, క్రమానుసారం పరీక్షలు చేయించుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారనీ, కానీ, ఆయన్ను జైల్లో ఉంచితే, చికిత్స సాధ్యం కాదని, ఆసుపత్రిలోనే చికిత్స చేయించాల్సివుందని నవాజ్ వ్యక్తిగత వైద్యుడు, హృద్రోగ నిపుణుడైన అద్నాన్‌ ఖాన్‌ చెప్పారు. నవాజ్ ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.