గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (16:08 IST)

బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తాం : మాయావతి జోస్యం

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి జోస్యం చెప్పారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమేనని ప్రకటించారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ పొత్తుతో బీజేపీ నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తాము అతి పెద్ద విజయం సాధిస్తామని మాయావతి స్పష్టంచేశారు. అయితే, ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించేందుకు ఎస్పీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు.
 
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిస్తే ప్రధాని అభ్యర్థిని మనమే డిసైడ్ చేయొచ్చన్నారు. ఇది ఒక అవకాశం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలకు యూపీ ప్రజలు పెద్ద గుణపాఠమే చెప్తారన్నారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం బీజేపీకే కాకుండా కాంగ్రెస్‌కు కూడా గుణపాఠం నేర్పాయని మాయావతి తెలిపారు.