శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (10:47 IST)

ప్రేమికుల రోజును సిస్టర్స్ డేగా జరుపుకోండి.. పాక్ వర్శిటీ

ఫిబ్రవరి 14న  ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేమికుల రోజును సిస్టర్స్ డేగా జరుపుకోవాలని.. పాకిస్థాన్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్, ఫైసలాబాద్ (యూఏఎఫ్) నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 14న మహిళలకు స్కార్ఫ్‌లు, అక్కాచెల్లెళ్లకు దుస్తులు బహూకరించాలని పిలుపునిచ్చారు. 
 
ఈ నేపథ్యంలో.. తూర్పుదేశాల సంస్కృతి, ఇస్లాం సంప్రదాయాలను పెంపొందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ జాఫర్ ఇక్బాల్ రణ్‌ధవా తెలిపారు. మన సంప్రదాయాల్లో మహిళలకు చాలా గౌరవం వుందని.. వారు చాలా సాధికారత కలిగినవారు. అక్కాచెల్లెళ్లుగా, తల్లులుగా, కుమార్తెలుగా, భార్యలుగా గౌరవం అందుకుంటున్నారని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతితో మన సంప్రదాయాల విలువను విస్మరిస్తున్నానని జాఫర్ తెలిపారు.