సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (16:15 IST)

అదరగొట్టిన కేజీఎఫ్.. పాకిస్థాన్‌లో విడుదల..

''కేజీఎఫ్''సినిమాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరో యష్ నటించిన కన్నడ చిత్రం.. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దేశ వ్యాప్తంగా 2500కి మించిన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హిందీ డబ్బింగ్‌లో అదరగొట్టింది. 
 
హిందీ డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన నాలుగో చిత్రంగా నిలిచిన ఈ సినిమా మరో సంచలన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రం పాకిస్థాన్‌లో విడుదలైంది. ఈ సినిమా హిందీ వర్షన్‌ను లాహోర్, ఇస్లామాబాద్‌ల్లోని మల్టీఫెక్స్‌లలో విడుదల చేశారు. అక్కడ కూడా కేజీఎఫ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 
 
కాగా.. కన్నడ సినిమా బాక్సాఫీసును కేజీఎఫ్ షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యష్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ సినిమా.. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 21న విడుదల విడుదలైన సంగతి తెలిసిందే.