సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 5 జనవరి 2019 (21:52 IST)

హిందువులపై పేటెంట్ హక్కేమీ బీజేపీ కి లేదు: విజయశాంతి

శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశంతో కేరళలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. హిందూ సంస్థలు, కమ్యునిస్టులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి స్పందించారు. కేరళలో భక్తుల మనోభావాలతో ఆడుతున్న చెలగాటంలో ఏదో తెలియని రాజకీయ కోణం కనబడుతూ ఉందన్నారు.
 
తరాల తరబడి కొనసాగుతున్న విశ్వాసాలపై ఎవరైనా సరే ఆలోచించి, ఆచితూచి వ్యవహరించాలన్నారు. బీజేపీకి హిందువుల నమ్మకాలపై, ఈ దేశంలోని దైవ భక్తులపై పేటెంట్‌ హక్కేమీ లేదని, అలాగే రెచ్చగొట్టే అధికారమూ కమ్యూనిస్టులకు లేదన్నారు. ఈ పరిణామాలు చివరికి ప్రజల మధ్య విద్వేషాలకు మాత్రమే దారి తీస్తాయని ఇది చరిత్ర బెబుతున్న సత్యంగా పేర్కొన్నారు విజయశాంతి.