శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (15:16 IST)

మోదీని పేల్చేస్తా.. సూసైడ్ బాంబర్ జాకెట్‌తో పాక్ సింగర్.. ఫోటో వైరల్

పాకిస్తాన్ సింగర్ రబీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రబీ భారత ప్రధాని మోదీపై మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మోదీని పేల్చేస్తానంటూ ‘సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో షేర్ చేసింది. తాను కశ్మీరీ బిడ్డనని, మోడీని హిట్లర్ తో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసి కొందరు పాకిస్థానీలు మెచ్చుకుంటే.. మరికొందరు పాకిస్థాన్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నావని తిట్టిపోస్తున్నారు. 
 
అయితే మోదీని పేల్చేస్తానన్న పాక్ సింగర్‌పై భారతీయులు ఫైర్ అవుతున్నారు. "ఇది నీ నేషనల్ డ్రెస్ కదా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు. పాక్ డెవలప్ చేసిన ప్రత్యేకమైన డ్రెస్‌ని ప్రపంచమంతా చూస్తోందంటూ ఫైర్ అవుతున్నారు. కాగా లాహోర్‌కు చెందిన ఈ సింగర్ ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి కాశ్మీ‌పై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.