పాములు, కొండ చిలువల్ని మోదీపై ప్రయోగిస్తా.. చెప్పిందెవరంటే? (video)

Last Updated: గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:26 IST)
జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత.. విషం కక్కుతున్న పాకిస్థానీయుల్లో తాజాగా గాయని రబీ పిరజాదా కూడా చేరిపోయింది. పాములు, మొసళ్లతో తానున్న వీడియోను పోస్టు చేసిన ఆమె.. తాను కాశ్మీరీ యువతినని చెప్పింది.

తన వద్ద ఎన్నో పాములు, కొండ చిలువలు ఉన్నాయని, వాటిని భారత ప్రధాని నరేంద్ర మోదీపైకి ప్రయోగిస్తానని చెప్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియోను చూసినవారంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

వీటిని నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా ఇచ్చి, ఆపై చనిపోయిన తరువాత నరకానికి వెళ్లేందుకు కూడా సిద్ధమని గాయని చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోపై నెట్టింట జోకులు కూడా పేలుతున్నాయి.దీనిపై మరింత చదవండి :