శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 29 జులై 2019 (11:58 IST)

వామ్మో చికెన్ ముక్క.. అలా ఎగిరిపడి.. ఎవరి నోటా పడకుండా జంప్ అయ్యిందా? (video)

చికెన్ ముక్కల్ని బాగా శుభ్రం చేసి వండి.. సర్వింగ్ ప్లేటులోకి తీసుకున్నారు. ఇక టేస్ట్ చేయడమే తరువాయి. కానీ అక్కడ జరిగిన సీన్ చూస్తే మీరు షాక్ కాక తప్పదు. వండి ప్లేటులోకి తీసుకున్న చికెన్ ముక్క.. ఆ ప్లేటు నుంచి తప్పించుకుని జారి కిందపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదెలా సాధ్యమని చాలామంది ఈ వీడియోను షేర్ చేస్తూ వస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన రీ ఫిలిప్స్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు. ఓ రెస్టారెంట్‌లోని టేబుల్‌పై వంటకాలు ప్లేటుల్లో వున్నాయి. అందులో చికెన్ ముక్కలు వున్నాయి. కానీ ఓ ప్లేటులోని చికెన్ ముక్క మాత్రం ఎవరి నోట్లో పడకుండా తప్పించుకోవాలనుకుందో ఏమో కానీ ప్లేటు నుంచి ఎగిరి కిందపడింది. దీన్ని చూసిన ఓ చెఫ్ సహ చెఫ్‌లతో చెప్పాడు. 
 
ఈ చికెన్ ముక్క చేతులు, కాళ్లు కలిగిన ఓ ఎలుకలా ప్లేటు నుంచి నడుచుకుంటూ కిందపడింది. దీన్ని చూసిన వారంతా షాకయ్యారు. ఇంకా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను బట్టి ఈ ఘటన థాయ్‌లాండ్, చైనాలో చోటుచేసుకుని వుంటుందని తెలుస్తోంది. దాదాపు ఈ వీడియోను 20 మిలియన్లకు పైబడిన వారు చూడగా, సుమారు రెండు లక్షల 50వేల మంది దీన్ని షేర్ చేశారు.