శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (17:00 IST)

చల్లచల్లగా కూల్‌ కూల్‌గా లాలీపాప్స్.. లాగించేస్తున్న పులులు

బ్రిటన్‌పై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవులే తాపాన్ని భరించలేక విలవిల్లాడుతున్నారు. ఇక మూగజీవుల పరిస్థితి దారుణంగా వుంది. 
 
ఈ క్రమంలో లండన్ జూపార్కులోని వన్య ప్రాణులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. మాంసాన్ని మంచు లాలీపాప్స్‌గా మార్చి పులుల ఎన్ క్లోజర్లలో వేలాడదీస్తున్నారు. వీటిని పులులు చల్లచల్లగా కూల్‌ కూల్‌గా లొట్టలేసుకుని లాగించేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.