శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (09:06 IST)

భార్యను 59 సార్లు కత్తితో పొడిచిన భర్త... తర్వాత ఏం జరిగింది?

భర్త ప్రవర్తన నచ్చక విడిపోవాలని భావించిన భార్య తెల్లవారేసరికి విగతజీగా పడివుంది. ఆమె శరీరంపై 59 కత్తిపోట్లు ఉన్నాయి. పోలీసులు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె భర్త పోలీసులకు నేరుగా లొంగిపోయి అసలు విషయం వెల్లడించారు.
 
ఈ ఘటన బ్రిటన్‌లో సంభవించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, లండన్‌లో మిట్టల్ (41), లారెన్స్ బ్రాండ్ (47) అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే, భర్త ప్రవర్తన నచ్చక బ్రాండ్ విడాకులు తీసుకోవాలని భావించింది. దీనిపై భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఒకరోజు జాయింట్ బ్యాంకు ఖాతా నుంచి మిట్టల్ 35000 ఫౌండ్ల నగదును డ్రాచేసుకుంది. దీంతో దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోపంతో ఊగిపోయిన భర్త వంటింట్లో ఉన్న చాకు తీసుకొని తన భార్యను పొడిచాడు. పొడిచేటప్పుడు చాకు ఇరిగిపోవడంతో మరో చాకుతో పొడిచి చంపాడు. 
 
ఆమె హత్యను చేసిన అనంతరం పోలీసులకు ఫోన్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఆమె మృతదేహంపై 59 కత్తిపోట్లు ఉన్నట్టు శప పరీక్షలో తేలింది. కుమార్తె హత్యపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ కోర్టులో జరుగగా, లారెన్స్ బ్రాండ్‌ను జీవితఖైదు (16 సంవత్సరాలు) శిక్షను అమలు చేసింది. లారెన్స్ బ్రాండ్ ఐటి కంపెనీలో ఉద్యోగ చేస్తున్నాడు. మిట్టల్ భారత సంతతికి చెందిన మహిళగా గుర్తించారు.