సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (12:21 IST)

లండన్‌లో హైదరాబాద్ వాసిని చంపిన పాకిస్థాన్ పౌరుడు

లండన్‌లో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈయన్ను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చంపేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ నగరానికి చెందిన నజీముద్దీన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆరేళ్ళ క్రితం లండన్‌కి వెళ్లాడు. అక్కడ ఓ కేఫ్‌లో పని చేస్తూ జీవిస్తున్నారు. ఆయన భార్య మాత్రం వైద్యురాలిగా పని చేస్తోంది.
 
అయితే గురువారం గుర్తు తెలియని దుండగులు నజీముద్దీన్‌పై కత్తులతో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నజీముద్దీన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నజీముద్దీన్ మృతి చెందాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఇదే కేఫ్‌లో పని చేస్తున్న పాకిస్థాన్ పౌరుడు ఒకడు హత్య చేసినట్టు కేఫ్  సిబ్బంది చెబుతున్నారు.