మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (17:02 IST)

బాలికపై తాత వరుసయ్యే కామాంధుడు అత్యాచారం...

తెలంగాణ రాష్ట్రంలో మరో బాలిక అత్యాచారానికిగురైంది. తాత వరుసయ్యే కామాంధుడు ఆ బాలిక శీలాన్ని చిదిమేశాడు. కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తుండటంతో ఆ బాలిక గర్భందాల్చింది. దీంతో అవమానభారంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అయితే, పోలీసులు మాత్రం అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నల్లగొండ పట్టణానికి చెందిన గొంగుల మొగులయ్య జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి మీర్‌పేట్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా భార్య ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయింది. దీంతో మొగులయ్య వరంగల్‌కు చెందిన దుర్గ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొగులయ్య పెద్ద కుమార్తెకు వివాహంకావడంతో మిగిలిన తన ఇద్దరు కుమార్తెలతో పాటు రెండో భార్యతో పాటు... తన కన్నతల్లితో కలిసి నివసిస్తున్నాడు. 
 
ఈ పరిస్థితుల్లో తరచూ దుర్గ ఇంటికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆమె మేనమామ మల్లేష్ వస్తూపోతుండేవాడు. దీంతో మల్లేష్ కన్ను మొగులయ్య రెండో కుమార్తె (17)పై పడింది. గత 6 నెలల క్రితం ఇంట్లో ఎవరూలేని సమయంలో మొగులయ్య ఇంటికి వచ్చిన మల్లేష్ అతని రెండో కుమార్తెకు మత్తు మందు కలిపిన ఐస్‌క్రీం ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరిస్తూ అప్పటి నుంచి పలు పర్యాయాలు బాలికపై మల్లేష్ అత్యాచారం చేస్తూ వచ్చాడు.
 
ఈ క్రమంలో బాలిక గర్భందాల్చడంతో మల్లేష్‌పై మిర్యాలగూడలో దుర్గ పెద్దమనుషులతో పంచాయితీ పెట్టింది. చేసిన తప్పుకు రూ.లక్షన్నర మల్లేష్ బాలికకు మూడు విడతల్లో చెల్లించాలని, ఈ డబ్బుతో బాలికకు గర్భం తీయించే విధంగా పెద్దమనుషులు తీర్మానించారు. అయితే, బాలిక మాత్రం తీవ్ర మనస్తాపానికి గురైన బుధవారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.