బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (11:21 IST)

51 రోజులు నరకం చూపించారు.. యువతిపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. పదహారేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై రెండు గంటల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ గదిలో నిర్భంధించిన ఆ కామాంధులు 51 రోజుల పాటు ఈ దురాగతానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన బాలికను ఇంటి పక్కనే వున్న ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. 
 
ఆమె చేతులు, కాళ్లు కట్టేసి రోజూ ఆమెను శారీరకంగా హింసించారు. అంతటితో ఆగకుండా ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇలా 51 రోజుల పాటు ఆ అమ్మాయికి నరకం చూపించారు. వారితో పాటు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన మరో యువకుడు ఆదిత్య కూడా ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. 
 
51 రోజుల పాటు నరకం అనుభవించి ఆ బాలిక చివరికి వారి చెర నుంచి తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాంతో ముగ్గురు కామాంధులపై ఐపీసీ 376డీ, 506, పోస్కో చట్టం 3/4 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.