మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (12:30 IST)

మరో స్టీఫిన్ హాకింగ్స్ ... 3 సబ్జెక్టుల్లో 100కి వంద వరకూ మార్కులు... కానీ కన్నీళ్లే...

రెండేళ్ళ వయస్సు నుంచి జన్యుసంబంధిత (మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతూ చనిపోయిన నోయిడా విద్యార్థి తను రాసిన మూడు పరీక్షల్లో దాదాపు వంద మార్కులు సాధించాడు. ఇటీవల సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. ఈ పరీక్షల్లో నోయిడాకు చెందిన వినాయక్ శ్రీధర్ రాసిన మూడు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.
 
ఈ విద్యార్థికి ఇంగ్లీషులో వందకు వంద, సైన్స్‌లో 96, సంస్కృతంలో 97 చొప్పున మార్కులు రాగా, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాయకుండానే చనిపోయాడు. ఆ విద్యార్థి రాసిన మూడు పరీక్షల్లో దాదాపు వంద మార్కులు సాధించడం గమనార్హం. 
 
పదో తరగతి సీబీఎస్ఈ ఫలితాలను ఈనెల పదో తేదీన సోమవారం వెల్లడించారు. నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థి పరీక్షలను కూడా చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడీ కేటగిరీ కింద పరీక్షలు రాయకుండా సాధారణ కేటగిరీలోనే పరీక్షలు రాశారు. 
 
దీనిపై బాధితుని తల్లి మమతా శ్రీధర్ మాట్లాడుతూ, తన కుమారుడు కుర్చీకే పరిమితమైనప్పటికీ.. అతని జ్ఞాపకశక్తి మాత్రం అపారమన్నారు. అందుకే పరీక్షలను కూడా స్వయంగా తనే రాశాడని చెప్పాడు. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫిన్ హాకింగ్స్ మాదిరిగానే తన కుమారుడు కూడా తన పనులు తానే చేసుకునేవాడనీ, అతడు వ్యోమగామి కావాలని పరితపించేవాడనీ కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నారు.