శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:50 IST)

కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ప్రియుడుని చంపేసిన తల్లి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తన ప్రియుడుని ఓ మహిళ చంపేసింది. ఈ దారుణం మీరట్‌కు సమీపంలోని ఔరాంగ్‌షాపూర్‌లోని డిగ్గి ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల డిగ్గి అనే ప్రాంతానికి చెందిన రాజీవ్ అలియాస్ రాజు (32) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి  విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
అదే ప్రాంతానికి చెందిన షమీమ్ అనే మహిళ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, షమీమ్‌కు అదే ప్రాంతానికి చెందిన ట్రక్కు డ్రైవర్‌ రాజీవ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజీవ్ ఆమె కుమార్తెతో కూడా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో షమీమ్ కుమార్తె స్థానికుడైన ముసాహిద్ అనే అబ్బాయి ప్రేమలో పడింది. ఈ విషయం షమీమ్‌, ప్రియుడు రాజీవ్‌ దృష్టికి వచ్చింది. పైగా, ఆ యువతి అలా మరో వ్యక్తితో ప్రేమాయణం సాగించడాన్ని రాజీవ్ జీర్ణించుకోలేక పోయాడు. 
 
దీంతో ఆమెతో తరచూ గొడవలు పడుతూ వచ్చాడు. రాజీవ్‌ తరచూ ముసాహిద్‌తో గొడవ పడుతూ ఉండటం, ముసాహిద్‌‌పై చేయి చేసుకోవడం.. తన కూతురి జీవితంలో కల్పించుకోవడం షమీమ్‌కు నచ్చలేదు.
 
దీంతో కూతురి ప్రేమికుడు సాయంతో రాజీవ్‌ను షమీమ్ ఏప్రిల్‌ 22వ తేదీన గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఊరికి చివర్లో రాజీవ్ మృతదేహాన్ని పడేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులైన షమిమ్‌, ముసాహిద్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.