సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (18:01 IST)

వేరొక వ్యక్తికి భార్య.. అయినా ప్రేమించాడు.. కాదన్నందుకు బాంబుతో కౌగిలించుకున్నాడు?

ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఆతడి ప్రేమను అంగీకరించలేదు. అంతే మానవబాంబుగా మారాడు.. ఆ యువతిని పేల్చి చంపేశాడు. ఈ దుర్ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని వయనాడు జిల్లా, సుల్తాన్‌ బథేరి సమీపంలోని నాయక్కట్టికి చెందిన నాజర్. ఇతని భార్య అమీనా (37). ఈ దంపతులకు ముగ్గురమ్మాయిలు. 
 
అదే ప్రాంతంలో నాజర్ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నాడు. అక్కడే బెన్నీ (47) అనే వ్యక్తి ఫర్నీచర్ షాపు నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో నాజర్ ఇంట్లో శుక్రవారం బాంబు పేలింది. ఈ పేలుడులో అమీనా, బెన్నీలు తీవ్రగాయాలతో మృతి చెందారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన విచారణలో బెన్నీ అమీనాను ప్రేమించాడని.. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఆమెకు చెప్పాడని.. కానీ అమీనా నిరాకరించినట్లు చెప్పారు. ఇలా శుక్రవారం అమీనాను కలిసేందుకు ఆమె ఇంటికి బాంబుతో వెళ్లిన పెన్నే.. మానవ బాంబుగా మారాడు. అమీనా బెన్నీ ప్రేమకు అంగీకరించకపోవడంతో మానవబాంబుతో ఆమెను కౌగిలించుకుని తనను తాను పేల్చుకున్నాడని పోలీసులు తెలిపారు.