మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (15:03 IST)

పిల్లలకు ఆ విషయాన్ని ఎలా నేర్పించాలి..?

పిల్లలు ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఎన్నో నేర్పించాలనుకుంటారు. కానీ వాళ్లు ఓ పట్టాన మాట వినరు. మనకంటూ బోలెడు పనులు ఉంటాయనేది వాస్తవమే. అయినప్పటికీ చిన్నారులతో తరచు మాట్లాడుతూ ఉండాలి. దానివలన వారి గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. వాళ్లకున్న సమస్యలు అర్థమవుతాయి.

కొంతమంది పిల్లలకు వ్యాయామం చేయమని, చదువుకోమని, పోషకాహారం తీసుకోమని చెప్పినా వినరు. అలాంటప్పుడు మీరు వాటిని పాటించి చూపించాలి. అప్పుడే వారు క్రమంగా చేయడం మొదలుపెడతారు.
 
పిల్లలకంటే కేవలం చదువు, వాళ్ల అభిరుచుల్ని సానబెట్టడం మాత్రమే కాదు. వాళ్లతో కలిసి ఆడిపాడడం కూడా. దీనివలన మీ ఒత్తిడి తగ్గడమే కాదు, చిన్నారులతో సరదాగా గడిపినవారవుతారు. పిల్లలపై మనకు ప్రేమ ఉన్నా.. వ్యక్తం చేస్తే ఎక్కడి మొండికేస్తారోనని ఆలోచించి మౌనంగా ఉండిపోతాం..
 
కానీ నిపుణుల ప్రకారం వాళ్లపై మీకున్న ప్రేమను తెలియజేయాలి. అది మాటలతో కావచ్చు, చేతలతోనైనా కావొచ్చు. అయితే కాస్త పెద్ద పిల్లలయినా సరే అప్పుడప్పుడూ దగ్గరకు తీసుకోవడం, భేష్ అంటూ భుజం తట్టడం.. వంటివి మీ ప్రేమను వారికి తెలియజేస్తాయి.