శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:15 IST)

పోర్న్ వీడియోలు తొలగించారని తల్లిదండ్రులపైనే కేసు వేసిన ప్రబుద్ధుడు

పోర్న్‌పై మనదేశంలో ఉన్న ఆంక్షలు మరే దేశంలోనూ లేవు. చాలా దేశాల్లో పోర్న్‌ను యధేచ్ఛగా వీక్షించేందుకు అక్కడి ప్రభుత్వాలే అంగీకరించాయి. ఇలా చాలా మంది పోర్న్‌కు బానిసలవుతున్నారు. ఇలా పోర్న్‌కు బానిసైన ఒక వ్యక్తి ఆ వీడియోలు తొలగించారని ఏకంగా తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టాడు. తాను ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో సేకరించిన పోర్న్ వీడియోలను డిలీట్ చేశారని కన్నతల్లిదండ్రులపై కేసు పెట్టాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే అమెరికాలోని భారత్‌కు చెందిన 27 ఏళ్ల చార్లీ అనే యువకుడు పోర్న్ వీడియోలకు బాగా అలవాటు పడ్డాడు. రకరకాల పోర్న్ వీడియోల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాడు. ఇలా ఎక్కడెక్కడి నుంచో చాలారకాల వీడియోలు సేకరించాడు. ఈ పోర్న్ వీడియోలను సేకరించేందుకు ఏకంగా 29 వేల డాలర్లు (దాదాపు 20 లక్షల రూపాయలు) ఖర్చు చేశాడు. 
 
పోర్న్ వీడియోల కారణంగా చార్లీ, అతని భార్య మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అతని తీరులో మార్పు రాకపోవడంతో అతని భార్య అతనితో గొడవపడి విడాకులు ఇచ్చేసింది. విడిపోయిన తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చెంతన చేరి, వారితో కలిసి ఉండేవాడు చార్లీ. ఈ సమయంలో ప్రతీరోజు రాత్రి చార్లీ పోర్న్ వీడియోలు చూస్తుండడాన్ని గమనించారు అతని తల్లిదండ్రులు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం చార్లీకి ఉన్నఈ వ్యసమేనని గుర్తించిన అతని తల్లిదండ్రులు ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేశారు.
 
తాను ఎంతో భద్రంగా దాచుకున్న వీడియోలు, తన కంప్యూటర్‌లో కనిపించకపోవడంతో చార్లీ ఎంతో ఆందోళనకు గురయ్యాడు. ఎంతో భద్రంగా దాచుకున్న సీడీ కాపీలు కూడా కనిపించకపోవడంతో చార్లీకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చిపట్టినట్లయింది. తల్లిదండ్రులను వాటి గురించి అడగగా ఆ వీడియోలను డిలీట్ చేశామని, సీడీలు పగులకొట్టేశామని చెప్పారు. 
 
ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టిన సేకరించిన కలెక్షన్స్ ధ్వంసం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన చార్లీ, వాటిని ధ్వంసం చేసిన తల్లిదండ్రులపై కోర్టులో దావా వేశాడు. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 86 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 59 లక్షల రూపాయలు చెల్లించాలంటూ కోరాడు. చార్లీ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు... ఎలా స్పందిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా.