మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:12 IST)

ఆటలకే పరిమితం తప్ప.. తిండి మీద ధ్యాస పెట్టరు...?

చాలామంది పిల్లలు ఆటలకే పరిమితం అవుతుంటారు తప్ప తిండి మీద ధ్యాస పెట్టరు. మరికొందరికైతే అసలు ఆకలి వేయదు. ఇలాంటి పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యమని చెప్తున్నారు. 
 
సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులందరు కలిసి తినేందుకు ప్రణాళిక వేసుకోవాలి. తినే సమయంలో కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ.. నవ్వుకుంటూ తింటూ ఉంటే ఆహార తినాలనే ఆలోచన, దృష్టి మళ్లుతుంది. హాయిగా తింటారు. అందుకని ఒకేసారి ఎక్కువగా కాకుండా.. కొద్దికొద్దిగా తినిపించడం అలవాటు చేసుకోవాలి.
 
ఉదయాన్నే నూనె పదార్థాలు కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారాలు తినాలి. ఇలా చేయడం వలన జీవక్రియ రేటు వృద్ధి చెందుతుంది. దానివలన ఆకలి ఎక్కువగా వేస్తుంది. కడుపునిండా తింటారు. అలానే వారికి ఎప్పుడు చూసినా ఒకే రకమైన ఆహారం ఇవ్వడం సరికాదు. వాళ్లకు నచ్చే పదార్థాలను పలురకాలుగా ప్రయత్నించి.. పెడితే ఇష్టంగా తింటారు. 
 
పిల్లలంటేనే చిప్స్ వంటి జంక్‌ఫుడ్స్ తినేందుకే ఎక్కువగా ఇష్టపడుతారు. అందువలన కూడా వారికి ఆకలి వేయదు. వాటికి బదులు అరటిపండ్లు, రాగి జావా, ఓట్స్, నువ్వులు, పల్లీ చిక్కీలూ, పండ్ల రసాలు ఇస్తుండడం మంచిది. ఇవి త్వరగా జీర్ణమై ఆకలిని పెంచుతాయి.