వారు టీవీ విషయంలో మొండిగా మారకూడదనుకుంటే..?

Last Updated: బుధవారం, 24 ఏప్రియల్ 2019 (15:48 IST)
తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుండే పిల్లలు టీవి చూడడం నేర్చుకుంటారు. ఇక చాలామంది స్త్రీలైతే టీవీలో సీరియల్స్ చూస్తూ పిల్లలతో హోమ్‌వర్క్ చేయిస్తుంటారు. దాంతో పిల్లలు తమకు తెలియకుండా వాటికి అలవాటు పడిపోతారు. చిన్నారులు టీవికే అతుక్కుపోవడం వలన వారిలో బద్ధకం పెరిగిపోతుంది. కళ్లు కూడా అలసిపోతాయి. ముఖ్యంగా నిద్ర తగ్గిపోతుంది.

అదేపనిగా కదలకుండా కూర్చోవడం వలన కౌచ్ పొటాటోగా మారుతారు. అంటే ఎలాంటి శారీరక కదలిక లేకుండా అదేపనిగా టీవీ చూస్తు బద్ధకంగా తయారవుతారు. తోటివారితో కలవకపోవడం వలన వారిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఉండవు. ఇలా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా.. అన్ని రకాలుగా నష్టపోతారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు వలన కూడా పిల్లలు టీవీ చూస్తుంటారు.

పైన చెప్పిన విధంగా పిల్లలు టీవీ విషయంలో మొండిగా మారకూడదనుకుంటే.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. టీవీ చూడొద్దు అంటూ ఒక్కసారిగా వారిని కట్టడి చేస్తే వారు మరింత మొండికేస్తారు. ఆ సమయాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయాల్ని అలవాటు చేయాలి.

ఇక వారాంతాల్లో పిల్లలను సరదాగా బయటకు తీసుకెళ్లాలి. భార్యభర్తలిద్దరు ఉద్యోగస్తులైతే పిల్లలను స్నేహితుల పిల్లలతోనో, చుట్టాల పిల్లలతోనో కలిసి ఆడుకునేలా, చదువుకునేలా చూడాలి. అలానే కథల పుస్తకాలు చదివించడం, బొమ్మలు వేయించడం, సంగీతం నేర్పించడం, ఆటలు ఆడించడం వంటివి తప్పనిసరి. అప్పుడప్పుడూ బయటి ప్రపంచాన్ని కూడా చూపించాలి.దీనిపై మరింత చదవండి :