సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (18:36 IST)

మెక్ డొనాల్డ్స్ చికెన్‌లో కోడి ఈకలు.. తిన్న చిన్నారి.. కడుపులో వికారం..

మెక్ డొనాల్డ్స్ చికెన్‌లో గతంలో ఎలుక కనిపించిన సంఘటనలు జరిగే వున్నాయి. తాజాగా మెక్‌డొనాల్డ్స్ చికెన్ వింగ్స్‌లో కోడి ఈకలు కనబడ్డాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వివరాల్లోకి వెళితే..  సింగపూర్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఓ మహిళ తనకు ఇష్టమైన చికెన్ వింగ్స్‌ అడర్ చేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఇచ్చిన ఆర్డర్ కూడా వచ్చింది. 
 
డబ్బులు కట్టి తన అడర్‌ని ఇంటికి తీసుకెళ్లింది. తీరా ఇంటికి వెళ్లే చూసేసరికి చికెన్ వింగ్స్‌లో కోడి ఈకలు ఉన్నాయి. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ మెక్‌డొనాల్డ్స్‌పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 21న మెక్‌డానాల్డ్స్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌లో మహిళ చికెన్ వింగ్స్‌ను తీసుకెళ్లింది. తన కూతురు వింగ్స్ తింటున్న సమయంలో ఈకలు ఉండటం గుర్తించానని మహిళా ఆరోపిస్తోంది. 
 
అయితే అప్పటికే తన కూతురు తెలియకుండానే మూడు వింగ్స్ తిన్నదని, తిన్న కొద్దిసేపటికే తన కూతురుకి కడుపంతా వికారంగా ఉన్నట్టు తనతో చెప్పిందని మహిళ ఆరోపించింది. ఇందుకు మెక్ డొనాల్డ్స్ నష్టపరిహారం ఇచ్చింది. కానీ తిరస్కరించిన మహిళ ఆహార -డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఆ రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేసింది.