సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (13:07 IST)

చిలుక చేసే పనేనా ఇది.. చిలుకను అరెస్ట్ చేశారు? ఇంతకీ ఏం చేసిందంటే?

చిలుక జోస్యం వినేవుంటాం. కొన్ని మాట్లాడే చిలుకలను ఇంట్లో పెంచుకోవడం వినేవుంటాం. అలా ఓ ఇంట్లో పెంచుకున్న ఓ చిలుక స్మగ్లర్‌ను కాపాడింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. అంతేకాదు.. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో బ్రెజిల్ పోలీసులు ఒక చిలుకను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు. ఆ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు అనుమానిత ఇంటిని చుట్టముట్టారు. 
 
ఇంతలో గుమ్మం వద్ద పంజరంలో ఉన్న చిలుక పోలీసులు వస్తున్నారనే విషయాన్ని పసిగట్టి.. మమ్మా పోలీస్ అని అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు పారిపోయారు. దీంతో స్మగ్లర్లను పట్టుకోవాలని వెళ్లిన పోలీసులకు నిరాశే మిగిలింది. చివరికి పోలీసులు వస్తున్నారని స్మగ్లర్లను హెచ్చరించిన పంజారంలో చిలుకను పట్టుకొచ్చారు. 
 
స్మగ్లర్లు పారిపోవటానికి చిలుకే కారణమని నిర్థారించుకున్న పోలీసులు వెంటనే దానిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం న్యాయస్థానంలో విచారణకు హాజరైన చిలుక నోరు మెదపలేదట. పర్యావరణ, పక్షి ప్రేమికుల డిమాండ్ మేరకు పోలీసులు దానిని స్ధానిక జంతు ప్రదర్శన శాలకు అప్పగించారు.