పోగొట్టుకున్న ఫోన్‌ను తెచ్చిస్తే రూ. 4 లక్షల బహుమతి... ఎక్కడ?

కుమార్ దళవాయి| Last Modified గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:02 IST)
సాధారణంగా ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే ఏం చేస్తారు. మహా అయితే దాని కోసం కొద్దిరోజులు వెతకడం చేసి, దానికి పెట్టిన ఖర్చును తలచుకుని బాధపడతారు. దానికి పెట్టిన ఖర్చు కంటే ఆ ఫోన్‌తో ముడిపడి ఉన్న అనేక బంధాలు తెగిపోతాయని బాధపడిపోతారు. అయితే ఒక ప్రముఖ మొబైల్‌ హానర్ కంపెనీ కూడా ఒక స్మార్ట్‌ ఫోన్‌‌ను పోగొట్టుకుంది.

ఆ ఏముంది..! ఆ సంస్థకు ఆ ఫోన్‌ ఒక లెక్కా? అనుకోవద్దు. ఎందుకంటే అది విడుదలకు సిద్ధమవుతూ ప్రయోగ దశలో ఉన్న ఫోన్‌. కొద్దిరోజుల్లో విడుదల చేయనున్న ఆ ఫోన్‌ను తీసుకొచ్చిన వారికి 5000 యూరోలు (మన కరెన్సీలో దాదాపు రూ. 4 లక్షలు) బహుమతిగా ఇస్తామంటోంది.

ఇందుకోసం హానర్‌ సంస్థ ఒక ట్వీట్ చేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి ఏప్రిల్‌ 22న డస్సెడ్రాఫ్‌ నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కు ప్రయాణించే సమయంలో ఐసీఈ 1125 రైలులో ఈ ఫోన్‌ను పోగొట్టుకున్నారని తెలిపింది. అంతేకాదు, బూడిద రంగులో ఉండి పైన కవర్ ఉన్న ఈ ఫోన్‌‌ను తెచ్చి ఇచ్చిన వారికి రూ. 4 లక్షలు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే మే 21 తర్వాత తెచ్చిస్తే ఆ డబ్బు ఇవ్వమని కూడా చెప్పింది.

దీనికి కారణం మే 21న హానర్‌ కంపెనీ 20 సిరీస్‌లో ఒక ఫోన్‌‌ను లండన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, కనిపించకుండా పోయిన ఆ ఫోన్‌ ప్రోటో టైప్‌ ఇదే కావచ్చని పలువురు అనుమానిస్తున్నారు. అందుకే హానర్ సంస్థ ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తామని అంటోందని చెబుతున్నారు.

త్వరలో ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేయనున్న నేపథ్యంలో సదరు ఉద్యోగి దాన్ని పరీక్షించే నిమిత్తం ప్రయాణంలో తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకతలు కూడా ఎవరికీ తెలియకుండా ఉండేందుకే దాన్ని తెచ్చిన వారికి రూ. 4 లక్షలు ఇవ్వన్నట్లు హానర్‌ ప్రకటించింది.దీనిపై మరింత చదవండి :