మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:54 IST)

ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ వాల్యూ వీక్.. భారీ తగ్గింపు ధరలకు స్మార్ట్‌ఫోన్‌లు..

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో 'సూప‌ర్ వాల్యూ వీక్' పేరిట ఓ సరికొత్త సేల్ నిన్న ప్రారంభించింది. ఆ సేల్ ఈనెల 29 తేదీ వరకు కొనసాగనుంది.


ఈ ఆఫర్‌లో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలకే అందించనున్నారు. ఈ సేల్‌లో మొబైల్ తయారీదారు హానర్ తన కంపెనీకి చెందిన 10 ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తున్న‌ది. 
 
సేల్‌లో భాగంగా హాన‌ర్ 9ఎన్‌, హాన‌ర్ 10 లైట్‌, హాన‌ర్ 7ఎ, 7ఎస్‌, హాన‌ర్ 9ఐ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. అలాగే కేవలం రూ.99కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు ప‌లు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల‌ను కూడా ఈ సేల్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.