శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (15:42 IST)

ఫాస్ట్‌ఫుడ్ డెలివరీబాయ్‌పై అమ్మాయిల లైంగికదాడి.. ఎక్కడ?

ఆర్డరిచ్చిన ఫుడ్‌ను డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్‌పై పలువురు అమ్మాయిలు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన షార్జాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షార్జాకు చెందిన కొంతమంది అమ్మాయిలు గదిని అద్దెకు తీసుకుని నివశిస్తున్నారు. వీరంతా కలిసి కొన్ని రకాల ఆహారపదార్థాలను ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చారు. 
 
ఈ ఆహార పదార్థాలను డెలివరీ చేసేందుకు ఓ బాయ్ వారు నివసించే ఫ్లాట్‌కు వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది. దీంతో ఓ యువతి డోర్ తెరిచి... డెలివరీ బాయ్‌ను ఇంట్లోకి దీసుకెళ్లింది. ఆ తర్వాత పలువురు అమ్మాయిలు అతన్ని బంధించి, కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
అంతేనా, అతని వద్ద ఉన్న 800 దిర్హామ్‌లతో పాటు మొబైల్ ఫోన్‌ను కూడా దోచుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన డెలివరీబాయ్‌ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ అమ్మాయిలందరినీ అరెస్టు చేశారు. తాము లాక్కున్న ఫోన్, డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ యువతులు పోలీసులకు చెప్పింది. అయినాసరే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయగా, ఈ కేసు ఈనెల 20వ తేదీన విచారణకురానుంది.