మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు ఓడాలిగా.. పిచ్‌ను అర్థం చేసుకోలేకపోయాం: ధోనీ

Last Updated: బుధవారం, 8 మే 2019 (14:33 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నైకి చుక్కలు చూపించింది.. ముంబై. ఈ సీజన్‌లోనూ చెన్నైని ముచ్చటగా మూడోసారి ఓడించిన ముంబై నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. 
 
ఐపీఎల్ 12వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్ దశ చివర్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య క్వాలిఫైయర్ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభమైనాయి. తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై చేతిలో పరాభవం పాలైంది. ఐపీఎల్‌లో ఏ జట్టునైనా ఓ ఆట ఆడుకునే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ముంబై చేతిలో మాత్రం ఖంగుతింది.  
 
ఈ మ్యాచ్ ఓటమిపై ధోనీ స్పందించాడు. ఈ మ్యాచ్ కోల్పోవడంపై ధోనీ వివరణ ఇచ్చాడు. క్రికెట్ మ్యాచే కాదు.. ఏ పోటీ అయినా ఓటమి అనేది తప్పదు. ప్రస్తుతం ఫైనల్లోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టాం.

పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. అనుభవంతో ఆడకుండా వదిలేశాం. కొన్ని క్యాచ్‌లు కోల్పోయాం.

స్పిన్నర్లు ఇంకా బాగా బంతులేసి వుంటే బాగుండేదని ధోనీ వివరించాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మే 10వ తేదీన ఎలిమినేటర్ పోటీల్లో గెలిచే జట్టుతో తలపడనుంది.దీనిపై మరింత చదవండి :